మెట్రో రైలు నిర్మాణంపై ప్రభుత్వం దూకుడు.. టెండర్లకు ఆహ్వానం

by Vemula.Srinu Prasad |

మెట్రో రైలు నిర్మాణంపై ప్రభుత్వం దూకుడు పెంచింది..

మెట్రో రైలు నిర్మాణంపై ప్రభుత్వం దూకుడు.. టెండర్లకు ఆహ్వానం
X

దిశ, వెబ్ డెస్క్: మెట్రో రైలు (Metro Rail) నిర్మాణంపై ప్రభుత్వం దూకుడు పెంచింది. తొలి దశ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈపీసీ ప్రాతిపదికన శుక్రవారం టెండర్లకు ఆహ్వానించింది. ఇందులో భాగంగా మెట్రో రైల్ కార్పొరేషన్(Metro Rail Corporation) టెండర్ల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మూడేళ్ల కాలపరిమితిలో తొలిదశ నిర్మాణం పూర్తి చేయాలని సూచించింది.

కాగా విశాఖతో పాటు విజయవాడలో మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వేగంగా అడుగులు వేసింది. ఇప్పటికే రూట్ మ్యాప్‌ను కూడా రెడీ చేసింది. భూసేరకణకు అధికారులు సిద్ధమవుతున్నారు. ముందుగా విశాఖలో మెట్రో రైలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు టెండర్లను ఆహ్వానించింది. టెండర్ దక్కిన సంస్థలకు తొలి దశ పనులను అప్పగించనుంది. ఇందులో భాగంగా టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.

Next Story