మామిడి రైతులకు భారీ గుడ్ న్యూస్.. రూ. 260 కోట్లు విడుదల

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-09 12:57:09  IST  )

తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది...

మామిడి రైతులకు భారీ గుడ్ న్యూస్.. రూ. 260 కోట్లు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: తోతాపురి మామిడి రైతుల(Totapuri Mango Farmers)కు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రూ.260 కోట్లు విడుదల చేసింది. గురువారం నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి. మామిడి రైతులకు కిలోకు రూ.4 చొప్పున అందించనుంది. ఈ రోజు సుదీర్ఘంగా భేటీ అయిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా మామిడి రైతుల సమస్యలపైనా మంత్రులు చర్చించారు. నిర్మాణంలోని ప్రజా ప్రతినిధుల క్వార్టర్స్‌కు రూ. 500 కోట్లు నిధులు కేటాయింపునకు ఆమోదముద్ర వేసింది. అమరావతి(Amaravati)లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(World Economic Forum)సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కమర్షియల్ వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గింపును కేబినెట్ ఆమోదించింది.

కాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనలో మామిడి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో చర్చించి తోతాపురి మామాడి రైతులకు మంత్రులు తీపికబురు అందించారు.

Next Story