గర్భిణీలకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఉచితంగానే ఆ ఇంజెక్షన్

by Vemula.Srinu Prasad |

రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది..

గర్భిణీలకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఉచితంగానే ఆ ఇంజెక్షన్
X

దిశ, వెబ్ డెస్క్: రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఫెర్రిక్ కార్బాక్సీ మాల్టోజ్ (ఎఫ్సీఎం) ఇంజెక్షన్‌ను ఉచితంగా అందించనున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ఇంజెక్షన్‌ను ఇప్పటివరకు బాలింతలకు మాత్రమే ఇస్తోంది త్వరలో గర్భిణీలకూ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హీమోగ్లోబిన్ స్థాయి 10 గ్రాముల కంటే తక్కువగా ఉన్న గర్భిణీలకు మాత్రమే ఈ ఇంజెక్షన్ ఇస్తామని ప్రకటించింది. ఒకటి లేదా రెండు ఇంజెక్షన్లతోనే హీమోగ్లోబిన్ స్థాయి పెరిగి రక్తహీనత సమస్య పరిష్కారమవుతుందని భావిస్తోంది. అలాగే అవసరమైన గర్భిణీలకు ఉచిత రవాణా సౌకర్యంగా ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలను మళ్లీఅందుబాటులో తీసుకుచ్చింది.

జిల్లాలకు ఇంజెక్షన్ల సరఫరా

బాలింతల కోసం ఇప్పటికే 53,500 ఎఫ్సీఎం ఇంజెక్షన్లను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే జిల్లాలకు సైతం పంపింది. ప్రతి సీహెచ్‌సీకి 80, ఏరియా ఆసుపత్రులకు 175, జిల్లా ఆసుపత్రులకు 400 చొప్పున ఇంజెక్షన్లను తరలించింది. గర్భిణీల కోసం కేంద్రం కేటాయించిన 18,500 ఇంజెక్షన్లను కూడా త్వరలో జిల్లాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటోంది. గర్భిణీలకు ఎఫ్సీఎం ఇంజెక్షన్ ఎలా ఇవ్వాలన్న అంశంపై త్వరలోనే జిల్లాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఇంజెక్షన్ తీసుకున్న మహిళల్లో హీమోగ్లోబిన్ స్థాయి రెండు నుంచి మూడు శాతం వరకు పెరిగినట్లు ఇప్పటికే గుర్తించింది.

Next Story