పొగాకు రైతులకు బిగ్ షాక్.. బ్లాక్ బర్లీని నిషేధిస్తూ ఆదేశాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-21 13:27:08  IST  )

గుంటూరు జిల్లా పొగాకు రైతులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది...

పొగాకు రైతులకు బిగ్ షాక్.. బ్లాక్ బర్లీని నిషేధిస్తూ ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా(Guntur) పొగాకు(Tobacco) రైతుల(Farmers)కు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. బ్లాక్ బర్లీ పొగాకు(Black Burley Tobacco) పంటను నిషేధిస్తూ కలెక్టర్ ఆదేశించారు. ఈ ఏడాది బ్లాక్ బర్లీ పొగాకు ధరలు భారీగా పతనం అయ్యే అవకాశం ఉందని, రైతులు సాగు చేయొద్దని తెలిపారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. బ్లాక్ బర్లీ పొగాకు క్రాఫ్ హాలిడే(Craf Holiday)పై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఏడాది అసలు పొగాకు పంట వేయొద్దని.. పొలం పిలుస్తోంది, పొలంబడి కార్యక్రమాల్లో రైతులందరికీ వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. పత్తి, మిర్చి పంటలకు కూడా ప్రత్యామ్నాయం సాగు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఎక్కడా కూడా పొగాకు వేయొద్దని, వేస్తే మళ్లీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. గత ఏడాదిలో మొక్క జొన్న మంచి దిగుబడి వచ్చిందని, రైతులకు లాభాలు వచ్చాయని కలెక్టర్ గుర్తు చేశారు.

Next Story