- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Visakha: హయగ్రీవకు బిగ్ షాక్.. భూ కేటాయింపు రద్దు
విశాఖలోని హయగ్రీవ సంస్థ(Hayagriva organization)కు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ..

దిశ, వెబ్ డెస్క్: విశాఖలోని హయగ్రీవ సంస్థ(Hayagriva organization)కు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. సంస్థకు కేటాయించిన భూములను రద్దు చేసింది. హయగ్రీవ ఫార్మ్ అండ్ డెవలపర్స్‌కు గతంలో ప్రభుత్వం 12.41 ఎకరాల భూములు(Lands) కేటాయించింది. అయితే హయగ్రీమ సంస్థ నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ భూములను రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా వృద్ధులకు ఉచితంగా ఆశ్రమం నిర్మిస్తామని భూములు ఇవ్వాలని విశాఖలో హయగ్రీవ సంస్థ 2006లో దరఖాస్తు చేసింది. అయితే 2008లో అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం.. విశాఖ ఎండాడలో 12.41 ఎకరాల భూమిని హయగ్రీవకు కేటాయించింది. ఈ భూమిలో పది శాతం విస్తీర్ణంలో తొలుత వృద్ధులకు ఉచితంగా ఆశ్రమం నిర్మించి ఇవ్వాలని నిబంధన పెట్టింది. అలాగే 30 శాతం భూమిలో రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు వంటి మౌలిక వసతులు కల్పించాలని కండీషన్ పెట్టింది. మిగిలిన 60 శాతం భూమిలో విల్లాలు నిర్మించి వృద్ధులకు మాత్రమే విక్రయించాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. అయితే ఈ భూముల్లో వృద్ధులకు ఆశ్రయం నిర్మించలేదని 2020లో విశాఖ కలెక్టర్(Visakha Collector) గుర్తించారు. అంతేకాదు ఆ భూములను ఫ్లాట్లుగా విభజించి అమ్ముకున్నారని సీసీఎల్‌కు లేఖ రాశారు. దీంతో ఆ భూములను రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.






