ప్రైవేటు ఆస్పత్రుల్లో 90 శాతం సిజేరియేన్ ఆపరేషన్లు.. ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |

గర్బిణీలకు సిజేరియన్లు చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది...

ప్రైవేటు ఆస్పత్రుల్లో 90 శాతం సిజేరియేన్ ఆపరేషన్లు.. ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: గర్బిణీ(Pregnant)లకు సిజేరియన్లు(Cesareans) చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఫైర్ అయింది. సాక్షాత్తు ఈ అంశాన్ని అసెంబ్లీలోనే లేవనెత్తింది. వైద్యారోగ్య శాఖ(Health Department)పై అసెంబ్లీలో చర్చ చేపట్టింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) మాట్లాడుతూ ప్రైవేటు ఆస్పత్రుల్లో 90 సిజేరియన్ ఆషరేషన్లు జరుగుతున్నాయన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల ధోరణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోందిచమని హెచ్చరించారు. గర్భిణిలకు సురిక్షిత ప్రసవంపై అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు సీఎం చంద్రబాబు సూచించారు. గర్భిణీలకు యోగా నేర్పించే పరిస్థితి రావాలని, ఇప్పటి నుంచి ఆ ప్రయత్నాలు చేయాలని చెప్పారు. ఆపరేషన్.. ఆపరేషన్ అనే పరిస్థితి వచ్చారని, సహజసిద్ధమైన శరీరాన్ని కోయడం మంచిది కాదన్నారు. సిజేరియన్లలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 98 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

Next Story