- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడప జిల్లాకు గుడ్ న్యూస్.. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు
కడప జిల్లాకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది...

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa District)కు ప్రభుత్వం(Government) గుడ్ న్యూస్ తెలిపింది. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు జిందాల్ పరిశ్రమ(Jindhal Company) ముందుకు వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని నాయకులు, అధికారులు పరిశీలించారు. జమ్మలమడుగు మండల సున్నపురాళ్లపల్లె(Sunnapurallapalle) వద్ద స్థలం పరిశీలన చేశారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని జిందాల్ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.
కాగా రాష్ట్ర విభజన సమయంలో కడప జిల్లాలో స్టీల్ కంపెనీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం కొంత మేర అడుగులు వేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై జగన్ ప్రభుత్వం చర్చించింది. కానీ కార్యచరణ ప్రారంభించలేదు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కదలికలు మొదలయ్యాయి.






