- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్... రూ. 2,653 కోట్లు విడుదల
ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది....

దిశ, వెబ్ డెస్క్: ఉద్యోగులు(Employees), కాంట్రాక్టర్ల(Contractors)కు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. సంక్రాంతి(Sankranti) సందర్భంగా ఇద్దరికి చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు మొత్తం రూ. 2,653 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ఆయా ఉద్యోగులు, కాంట్రాక్టర్లు కొద్ది రోజులుగా ప్రభుత్వానికి కోరుతూ వచ్చారు. త్వరలోనే విడుదల చేస్తామని ఆ సమయంలో ప్రభుత్వం హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా తాజాగా ఉద్యోగుల డీఏ, డీఆర్ ఎరియర్స్, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు రూ. 2,653 కోట్లు విడుదల చేసింది. పెండింగ్ లో ఉన్న డీఏ, డీఆర్ ఎరియర్స్ కోసం రూ.1100 కోట్లు, పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవ్‌లకు రూ. 110 కోట్లు, ఈఏపీ, నాబార్డ్, సాస్కీ, సీఆర్ఐఎఫ్ పనులకు సంబంధించిన బకాయిలు రూ. 1243 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ఈ బకాయిలతో 5 లక్షల ఏడు వేల మందికి లబ్ధి చేకూరనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం ఉద్యోగులు, కాంట్రాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు.






