- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడ మెట్రోకు కీలక అడుగులు.. ఈ టెండర్లకు ఆహ్వానం
విశాఖ, విజయవాడలో మెట్రో రైలు(Metro Rail) నిర్మాణం చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయానికి కీలక అడుగులు పడ్డాయి....

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha), విజయవాడ(Vijayawada)లో మెట్రో రైలు(Metro Rail) నిర్మాణం చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయానికి కీలక అడుగులు పడ్డాయి. ఇప్పటికే విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి అధికారులు టెండర్లు పిలిచారు. తాజాగా విజయవాడ మెట్రోకు కీలక అడుగులు పడ్డాయి. తొలి దశ నిర్మాణానికి మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు శ్రీకారం చుట్టారు. 38.4 కిలోమీటర్ల మేర రెండు కారిడార్లలో మెట్రో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మొదటి కారిడార్‌లో విజయవాడ బస్టాండ్ దగ్గర నుంచి గన్నవరం బస్టాండ్ వరకు, కారిడార్‌లో 4.7 కిలో మీటర్ల మేర డబుల్ డెక్కర్ నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తాజాగా ఈపీసీ విధానంలో టెండర్లకు ఆహ్వానం పలికారు.. మొత్తం 32 మెట్రో స్టేషన్లు, ఒక చోట అండర్ గ్రౌండ్ స్టేషన్ నిర్మాణం చేపట్టనున్నారు. మరోవైపు విశాఖ మెట్రోకు సైతం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. ఇప్పుడు విజయవాడకు సైతం టెండర్లకు పిలుపునిచ్చారు. దీంతో విశాఖ, విజయవాడలో మెట్రో రైలు నిర్మాణానికి ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. టెండర్ల ప్రక్రియ అనంతరం మెట్రో పనులు ప్రారంభంకానున్నాయి.






