అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

by Thanuru Gopichand |

శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.

అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీశైలం (Srisailam) మహాక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా (International Spiritual Centre) తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) అన్నారు. శ్రీశైల క్షేత్రంలో సోమవారం పర్యటించిన మంత్రి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో మంత్రికి దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కార్యనిర్వాహక అధికారి, సిబ్బంది స్వాగతించారు. దర్శనం తరువాత మంత్రికి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతుల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, క్యూలైన్ల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. దేవాలయ పవిత్రతను కాపాడడంతో పాటు భక్తులకు భద్రతకు, వసతులను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తోందని ప్రకటించారు.

Next Story