ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యం : మంత్రి

by Thanuru Gopichand |

ప్రజారోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యం : మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో సంపూర్ణ ఆరోగ్యంతో కూడి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ (Minister Kandula Durgesh) అన్నారు. నియోజకవర్గానికి చెందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ సోమవారం నిర్వహించారు. నిడదవోలులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 61 మంది బాధితులకు రూ.44.80 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఎల్ఓసీ పత్రాలను మంత్రి స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా 57 మందికి రూ.31.80 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ముగ్గురు లబ్ధిదారులకు ఫైనాన్సియల్ అసిస్టెన్స్ కింద ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున రూ.9 లక్షల ఆర్థిక సాయం, అలాగే ఒకరికి రూ.4 లక్షల విలువైన ఎల్‌వోసీ పత్రాలను పంపిణీ చేయడం జరిగిందని మంత్రి వెల్లడించారు.

అనంతరం మాట్లాడుతూ ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వారికి నాణ్యమైన వైద్య అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ పథకాలను విజయవంతగా అమలు చేస్తోందన్నారు. నియోజకవర్గ పరిధిలో సంక్షేమ పథకాల అమలు, ప్రాంతాల అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలను తెలియజేశారు.

ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 556 మందికి రూ.4 కోట్ల 9 లక్షల 17 వేల 825 రూపాయల ఆర్థిక సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. పేదరికానికి అనారోగ్యంతో తోడైతే ప్రజలకు తీవ్ర అవస్థలు తప్పవన్నారు. అలాంటి సమయంలో ప్రజలకు భరోసా కల్పించేందుకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందజేస్తున్నట్లు తెలియజేశారు.

Next Story