- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికసిత భారత్ నిర్మాణమే లక్ష్యం : ఏపీ బీజేపీ అధ్యక్షుడు
అంత్యోదయ సిద్ధాంతం.. స్వావలంబన భారత్ నిర్మాణమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్యేయం అని మాధవ్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌పై ఏపీ భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రోత్సహించే ఆత్మనిర్భర్ బడ్జెట్ (Atma Nirbhar Bharat) అని ఆయన అభివర్ణించారు. జై హో మోదీ (Jayaho Modi) అంటూ ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతను కొనియాడారు. ఇది మెరుస్తున్న భారతదేశం (Shining Bharat) కోసం రూపొందించిన సూపర్ బడ్జెట్ అని పేర్కొన్నారు. సమాజంలో చిట్టచివరి వ్యక్తికి ఫలాలు అందాలనే అంత్యోదయ (Antyodaya) సిద్ధాంతంతో పాటు దేశం తన కాళ్లపై తాను నిలబడేలా స్వావలంబన భారత్ (Swavalambhana Bharath) నిర్మాణం కోసం ప్రధాని గొప్ప ప్రయత్నం చేశారని ప్రశంసించారు.
ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా సాంకేతిక (Technology), ఆరోగ్య (Health) రంగాలకు పెద్దపీట వేయడంపై మాధవ్ ఆనందం వ్యక్తం చేశారు. సెమీకండక్టర్ మిషన్ 2.0 (Semi Conductor 2.0) ద్వారా భారతదేశాన్ని అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా మార్చే దిశగా అడుగులు పడ్డాయన్నారు. అలాగే బయో ఫార్మా శక్తి (Bio Pharma Shakti) పథకం దేశీయ ఔషధ రంగానికి సరికొత్త ఉత్తేజాన్నిస్తుందని ఆయన వివరించారు. ఈ సంస్కరణలు ప్రపంచానికి భారతదేశ కొత్త దిశను చూపుతాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను అగ్రపథాన నిలుపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ విశ్వగురువుగా ఎదిగే ప్రక్రియలో ఈ బడ్జెట్ ఒక కీలక మైలురాయి అని పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు.






