సైకో పాలనను అంతం చేస్తేనే.. రాష్ట్రానికి భవిష్యత్తు: సీఎం జగన్‌పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
సైకో పాలనను అంతం చేస్తేనే.. రాష్ట్రానికి భవిష్యత్తు: సీఎం జగన్‌పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సైకో పాలన అంతం చేస్తేనే తప్పా.. రాష్ట్రానికి భవిష్యత్తు లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అనకాపల్లి జిల్లా మాడుగులలో నిర్వహించిన ‘రా.. కదలి రా’ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత హమీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని అన్నారు. పరిపాలనా అనుభవం లేకపోవడంతో అర్థిక వనరులు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

మరోకొద్ది రోజుల్లోనే టీడీపీ-జనసేన నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రాబోతోందని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఎన్నడూ చూడలేదని తెలిపారు. పథకాలు అమలు చేస్తూనే ప్రజలపై కరెంట్ చార్జీల రూపంలో రూ.64 వేల కోట్ల భారం మోపిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని అన్నారు. సీపీఎస్ రద్దు, జాబ్‌ క్యాలెండర్‌, మద్య నిషేధం, రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు జగన్ ప్రయత్నించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు విషయాలను గ్రహించి టీడీపికి ఓటు వేసి సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నారు.

Next Story

Most Viewed