- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిధులు మావి..ఫోటోలు మీవా? ఇలానే ఉంటే నిధులు ఆపేస్తా: ఏపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ఆగ్రహం
by Seetharam |
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. తిరుపతిలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తున్నా.. వైసీపీ ప్రభుత్వం కనీసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫొటోను సంక్షేమ పథకాలపై పెట్టడం లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రతి పథకానికి రాష్ట్రానికి అందిస్తోంది అని చెప్పుకొచ్చారు. ఎక్కడా కూడా కేంద్రం ఇస్తున్నట్టు తెలియజేయడం లేదన్నారు. ఇది ఇలాగే కొనసాగితే తన శాఖ పరిధిలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపివేస్తామని గిరిరాజ్‌సింగ్ తీవ్రంగా హెచ్చరించారు.
Next Story






