అటవీ భూమిని ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు.. స్పందించిన మాజీ మంత్రి

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-29 14:09:49  IST  )

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) భూ ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించింది.

అటవీ భూమిని ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు.. స్పందించిన మాజీ మంత్రి
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) భూ ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో భూ అక్రమణలపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా(Chittoor District) మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో 75 ఎకరాల అటవీ భూములను ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై వైసీపీ నేత(YCP Leader), మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Former Minister Peddireddy Ramachandra Reddy) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూమిని తాము 2001లోనే కొనుగోలు చేశామని వెల్లడించారు.

సీఎం చంద్రబాబు(CM Chandrababu) కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు బాగా తెలుసు అన్నారు. చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా సహాయంతో తమ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీ(andhra Pradesh)కి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) హయాంలో రెవెన్యూ అధికారులు ఆ భూమిని సర్వే చేశారని వెల్లడించారు. దీనికి సంబంధించి గతంలో ఫారెస్ట్ గెజిట్(Forest Gegit) కూడా విడుదలైందని తెలిపారు. ఇది పబ్లిక్ డొమైన్ లోనే ఉంటుందని, ఎవరైనా చూసుకోవచ్చని పెద్దిరెడ్డి తెలిపారు. గతంలో అది వాహనాలు పోయేందుకు వీలుగా ఉందని.. దాన్ని పక్కా రోడ్డుగా మార్చేందుకు తాము దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. పక్కా రోడ్డు వేస్తే ఇతర రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో అటవీశాఖ నుంచి అనుమతులు కూడా తెచ్చుకున్నామని పెద్దిరెడ్డి వివరించారు.

ఈ క్రమంలో 2022 లో తారు రోడ్డు వేసుకోవచ్చని అనుమతి వచ్చిందని వెల్లడించారు. ఈ అంశంపై కూడా మీడియా ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒక అబద్ధాన్ని 10 సార్లు, 20 సార్లు సీఎం చంద్రబాబు ఏ విధంగా చెబుతారో.. ఈ పచ్చ మీడియా కూడా అదే విధంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. గతంలోనూ ఇలాగే వ్యక్తిత్వ హననానికి పాల్పడితే వారిపై చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఇప్పుడు భూ ఆక్రమణలు(Land grabs) అంటూ తప్పుడు కథనాలు రాసిన మీడియా సంస్థలపై కూడా పరువు నష్టం దావా వేస్తామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు.

Next Story