సిట్ విచారణకు హాజరుకాని మాజీ మంత్రి.. కారణం ఇదేనా!

by Jakkula.Mamatha |

ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

సిట్ విచారణకు హాజరుకాని మాజీ మంత్రి.. కారణం ఇదేనా!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం పై దర్యాప్తు చేస్తున్న సిట్ మాజీ ఎక్సైజ్ మంత్రి కె. నారాయణ స్వామికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు(సోమవారం) ఉదయం 10 గంటలకు SIT ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ తరుణంలో ఇవాళ సిట్ విచారణకు మాజీ మంత్రి నారాయణస్వామి హాజరు కావాల్సి ఉండగా.. విచారణకు రాలేనని అధికారులకు సమాచారమిచ్చారు. అనారోగ్యం, వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 10 గంటలకు నారాయణస్వామి విజయవాడలోని కార్యాలయానికి రావాల్సి ఉంది.

Next Story