YS Sharmila:రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ ఏర్పాటు సంతోషకరం

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా(Smuggling of ration rice) పై ఏపీ పీసీసీ(AP PCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila:రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ ఏర్పాటు సంతోషకరం
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా(Smuggling of ration rice) పై ఏపీ పీసీసీ(AP PCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషకరమని వైఎస్ షర్మిల అన్నారు. సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1,750కోట్ల ముడుపుల పై విచారణ ఎప్పుడని ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా ఆమె ప్రశ్నించారు. ఆధారాలు, అధికారం దగ్గర పెట్టుకుని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. నాడు జగన్ మాదిరే బాబూ అదానీకి అమ్ముడుపోయారని అర్థమవుతోందన్నారు. తక్షణమే సోలార్ డీల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. గత ప్రభుత్వంలో అదానీతో జరిగిన అక్రమ డీల్ పై ఎందుకు ఫోకస్ చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా? మాజీ సీఎం వైఎస్ జగన్(Former Minister Jagan) స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే, నిజ నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత మీకు లేదా అని నిలదీశారు. తీగ లాగితే మాజీ సీఎంతో పాటు, అదానీని సైతం అరెస్టు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా? అని సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లపై మీరు నోరు విప్పకుండా, విచారణ చేయకుండా ఎందుకు ఉంటున్నారు? అని వైఎస్ షర్మిల మండిపడ్డారు.

Next Story