- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదావరికి వరద పోటు.. ఆ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
రాజమండ్రి వద్ద గోదావరి నదికి వరద ఉధృతి పెరిగింది....

దిశ, వెబ్ డెస్క్: ఎగువన కురుస్తున్న వర్షాల(Rains)తో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి(Rajahmundry) వద్ద గోదావరి(Godavari) నదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో ధవళేశ్వరం(Davaleswaram)లో నీటిమట్టం 10 అడుగులకు చేరింది. 175 గేట్ల నుంచి 6 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఆదివారి ఉదయంకల్లా దాదాపు 10 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అటు కోనసీమ లంక గ్రామాలకు వరద నీటి తాకిడి పెరిగింది. పి.గన్నవరం మండలంలో ఇప్పటికే పలు గ్రామాలకు పడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. శుక్రవారం ముక్తేశ్వరం-కోటిపల్లి మధ్య మట్టి రహదారి కొట్టుకుపోయింది. దీంతో అమలాపురం- ముక్తేశ్వరం నుంచి కోటిపల్లి- ద్రాక్షారామం వైపు వెళ్లాల్సిన పంటును నిలిపివేశారు. పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరంలోని తీర ప్రాంత గ్రామాలపైనా వరద ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ మేరకు గౌతమి, వశిష్ట, వైనతేయ వెంబడి ప్రజలకు బిగ్ అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు అధికారులు, ఎన్డీఆర్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని, సహాయ చర్యల కోసం సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.






