వైసీపీ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-07 10:56:37  IST  )

ఏపీ అసెంబ్లీకి హాజరుకాని వైసీపీ ఎమ్మెల్యేలపై ఎథిక్స్ కమిటీ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది..

వైసీపీ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ(Ap Assembly)కి హాజరుకాని వైసీపీ ఎమ్మెల్యేల(Ycp Mlas)పై ఎథిక్స్ కమిటీ(Ethics Committee) చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. తొలుత నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ(Ap Assembly)లో భేటీ అయిన ఎథిక్స్ కమిటీ సభ్యులు.. అసెంబ్లీ(Assembly)కి రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడంపై చర్చించారు. టీఏ, డీఏలు తీసుకోవడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నట్లు గుర్తించారు. వీరికి నోటీసులు ఇచ్చే అంశంపైనా చర్చించారు. త్వరలో నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఎథిక్స్ కమిటీ సభ్యుల వివరణ, నిపుణులు, ప్రజాభిప్రాయం తీసుకుని ముందుకెళ్దామని జ్యోతుల నెహ్రూ ప్రతిపాదించారు. అయితే ముందుగా ఇద్దరు సభ్యుల ప్రతిపాదనలు తీర్మానం చేసి తదుపరి భేటీలో చర్చించాలని ఎథిక్స్ కమిటీ నిర్ణయించింది.

Next Story