ఆ ఆలయంలో ఫ్లెక్సీల వివాదం.. క్షమాపణ చెప్పిన ఈవో

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-26 10:54:58  IST  )

రెండు తెలుగు రాష్ట్రాల్లో అషాడ మాసం పూర్తయి.. శ్రావణ మాసం ప్రారంభమైంది.

ఆ ఆలయంలో ఫ్లెక్సీల వివాదం.. క్షమాపణ చెప్పిన ఈవో
X

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో అషాడ మాసం పూర్తయి.. శ్రావణ మాసం ప్రారంభమైంది. దీంతో అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో భక్తులు శ్రావణమాసం ప్రారంభం కావడంతో.. దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని కడప జిల్లా గండి క్షేత్రంలో ఫ్లెక్సీల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. శ్రావణమాసం ఉత్సవాల సందర్భంగా జనసేన నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఫోటోలతో బ్యానర్ ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో బ్యానర్లు పెట్టడానికి వీలు లేదని ఆలయ ఈవో వెంకటసుబ్బయ్య అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఆహ్వనపత్రికలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో లేదని అందుకే బ్యానర్ ఏర్పాటు చేశామని జనసేన నాయకులు వాదించారు. దీంతో వారికి ఈవో క్షమాపణలు చెప్పారు.

Next Story