పూర్తిగా పతనం... రూ.5కే కిలో ఉల్లిపాయలు

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల ఎఫెక్ట్ ఉల్లి రైతులపై పడింది...

పూర్తిగా పతనం...   రూ.5కే కిలో ఉల్లిపాయలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల ఎఫెక్ట్ ఉల్లి రైతుల(Onion farmers)పై పడింది. కర్నూలు(Kurnool), కడప(Kadapa) జిల్లాలో ఉల్లి దిగుబడి బాగా ఉన్నా గిట్టుబాటు ధర మాత్రం లేదు. ఈ రెండు జిల్లాల్లో పండించిన ఉల్లి పంటలను పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్‌(TadepalliGudem Market)కు తరలించి అమ్ముకుంటారు. అయితే ఈసారి మాత్రం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉల్లిని కొద్ది రోజులగా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు, ట్రేడర్లు అనాసక్తి చూపుతున్నారు. ఉల్లిపాయల ధర రూ. 6 కంటే ఎక్కువ పలకని సమయంలో మార్క్‌ఫెడ్(Markfed) ద్వారా కొనుగోలు చేసి తాడేపల్లి మార్కెట్‌కు పంపారు.

అయితే పెద్దగా నిల్వ ఉండకపోవడం, ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో ధరలు పడిపోయాయి. కడప నుంచి తాడేపల్లిగూడెంకు ఉల్లిని తీసుకొచ్చిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో ఉల్లి మార్కెట్ డల్‌గా ఉందని, రూ.5, 6కే అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధరకు ఉల్లిని ఇస్తేనే తమకు భారీగా నష్టం వస్తుందని వాపోయారు. రూ. 15 నుంచి రూ.20 వస్తే తప్ప పెట్టుబడి, ట్రాన్స్ పోర్టు ఖర్చులు వస్తాయని చెబుతున్నారు. ఎకరా పంటకు తాము లక్షా 50 వేల నుంచి 70 వేల వరకూ ఖర్చు అయిందని, తాడేపల్లిగూడెంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో తాము దిక్కుతోచని స్థితిలో ఉన్నామని తెలిపారు. ఈ ఏదాడి చాలా దారుణంగా ఉందని, తమకు న్యాయం చేయాలని కడప, కర్నూలు రైతులు కోరుతున్నారు

Next Story