- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!!
తెలుగుదేశం పార్టీ (TDP) జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ దాదాపుగా తుది దశకు చేరుకుంది. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసే లక్ష్యంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) ఈ కీలక కసరత్తు నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగుదేశం పార్టీ (TDP) జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ దాదాపుగా తుది దశకు చేరుకుంది. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసే లక్ష్యంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) ఈ కీలక కసరత్తు నిర్వహించారు. ఈ మేరకు జిల్లాల ఎమ్మెల్యేలు, ముఖ్య పార్టీ నేతలకు అధిష్ఠానం నుంచి దాదాపు ఖరారైన అధ్యక్షుల జాబితాపై సమాచారం అందినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నియామకాలలో అనుభవం, సామాజిక సమీకరణాలు, యువతకు ప్రాధాన్యం వంటి అంశాలకు పెద్దపీట వేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
'సమాచారం ప్రకారం పలువురు సీనియర్ నాయకులు, కీలక నేతలకు జిల్లా పగ్గాలు అప్పగించనున్నారు. తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి పేరు దాదాపు ఖరారు అయిందని తెలుస్తోంది. అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా కాలవ శ్రీనివాసులు, విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున వంటి సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పల్నాడు జిల్లాకు కొమ్మాలపాటి శ్రీధర్, నంద్యాల జిల్లాకు ధర్మవరం సుబ్బారెడ్డి, ప్రకాశం జిల్లాకు ఉగ్ర నరసింహా రెడ్డి పేర్లను దాదాపు ఖరారు చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నియామకాల ద్వారా జిల్లాల వారీగా పార్టీ కేడర్‌కు నూతన ఉత్తేజం తీసుకురావాలని అధిష్ఠానం భావిస్తోందని నాయకులు చెబుతున్నారు.
ఇక ఇతర ముఖ్య జిల్లాల విషయానికొస్తే.. కాకినాడ జిల్లాకు జ్యోతుల నవీన్, ఏలూరు జిల్లాకు బడేటి చంటి, చిత్తూరు జిల్లాకు షణ్ముగం, అన్నమయ్య జిల్లాకు సుగవాసి ప్రసాద్ అధ్యక్షులుగా దాదాపు ఖరారైనట్లు సమాచారం. శ్రీ సత్యసాయి జిల్లాకు ఎంఎస్ రాజు, బాపట్ల జిల్లాకు సలగల రాజశేఖర్ వంటి నేతలను కూడా అధ్యక్షులుగా నియమించనున్నారని తెలియవస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత చేపట్టిన ఈ పునర్వ్యవస్థీకరణ పార్టీకి అత్యంత కీలకంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని జిల్లాల అధ్యక్షుల నియామకాలు కొలిక్కి రావడంతో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.






