- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Andhra Pradesh News : ఏపీ జిల్లాలకు భారీగా నిధులు విడుదల
జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు భారీగా నిధులను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది....

దిశ, వెబ్ డెస్క్: జాతీయ ఆరోగ్య మిషన్(National Health Mission) ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రూ.128.43 కోట్లను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. అంతేకాదు ఈ నిధులను వచ్చే నెల 20 నాటికి ఖర్చు చేయాలని ఆదేశించింది. గుంటూరు జిల్లాకు రూ.20.61 కోట్లు, నెల్లూరు జిల్లాకు రూ.8.60 కోట్లు, కృష్ణా జిల్లాకు రూ.6.21 కోట్ల చొప్పున ఎన్‌హెచ్ఎం బడ్జెట్‌లో చివరి విడత కింద (2025-26) విడుదల చేసింది. మిగిలిన జిల్లాలకు గరిష్టంగా రూ.5.20 కోట్ల నుంచి రూ.2 కోట్ల చొప్పున పంపించిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. మార్గదర్శకాలు అనుసరించి నిధులను ఖర్చుపెట్టి, వివరాలు సమర్పించాలని అధికారులకు స్పష్టంచేశారు. జిల్లా విద్యా శాఖ అధికారులతో మంగళగిరి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వీరపాండియన్ పాల్గొని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.






