- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క రూపాయి రాలేదు.. సర్వ నాశనం చేశారు: పయ్యావుల ఫైర్
అమరావతి చట్టబద్దత తీర్మానంపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ..

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) చట్టబద్దత తీర్మానంపై అసెంబ్లీ(Assembly)లో చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Finance Minister Payyavula Kesav) మాట్లాడుతూ గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు పేరుతో నాటకమాడి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్(Ys Jagan) హయాంలో రాష్ట్రానికి పెట్టుబడి రూపంలో ఒక్కరూపాయి కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu) రాత్రంబవళ్లు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చేందుకు అమరావతి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రానికి ఎప్పటికైనా వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమన్నారు. రాజధానినిని శాశ్వతంగా రక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని పయ్యావుల పేర్కొన్నారు.






