కోనసీమ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుకు చేరిన మృతులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-08 11:39:44  IST  )

కోనసీమ జిల్లా రాయవరం బాణాసంచా కేంద్రంలో జరిగిన పేలుడులో మృతులు ఏడుకు పెరిగారు..

కోనసీమ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుకు చేరిన మృతులు
X

దిశ, వెబ్ డెస్క్: కోనసీమ జిల్లా రాయవరం(Rayavaram)లోని బాణాసంచా కేంద్రం(Fireworks center)లో పేలుడు జరిగిన విషయం తెలిసిందే. అయితే మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకూ ఏడుగురు సజీవ దహనం అయినట్లు గుర్తించారు. ఈ ఘటనలో బాణాసంచా కేంద్రం యజమాని సైతం మృతి చెందారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతులకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story