ఎమ్మెల్సీ ఎన్నికల మర్నాడే.. అసెంబ్లీలో ఏపీ బడ్జెట్..

by Thanuru Gopichand |   (  Updated:2025-02-20 09:27:11  IST  )

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈనెల 28వ తేదీన బడ్జెట్ ను ప్రవేశ పెట్టమన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల మర్నాడే.. అసెంబ్లీలో ఏపీ బడ్జెట్..
X

దిశ డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈనెల 28వ తేదీన బడ్జెట్ ను ప్రవేశ పెట్టమన్నారు. ఈ మేరకు సమావేశాల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈనెల 24వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరుసటి రోజు 25వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది. మొదటిరోజు బీఏసీ తర్వాత ఎన్ని రోజులు సభను నడపాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశాల్లోనే ఏపీ ప్రభుత్వం 2025 .. 26 కు సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన గెజిట్ ను గతంలోనే విడుదల చేసింది. ఈనెల 27వ తేదీన ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ మరుసటి రోజునే బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలలు దాటింది. గత ఏడాది జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉండగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో కొంత సమయం తీసుకున్నారు. రెండుసార్లు ఓటాన్ అకౌంటు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న అప్పులు, అమలు చేయాల్సిన పథకాలు.. వాటికి అయ్యే ఖర్చుల గురించి పూర్తిగా మదింపు చేశారు. సంక్షేమ పథకాలకు ఎంత ఖర్చు అవుతుందనేది కూడా అంచనాకు వచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పలుమార్లు చర్చించారు. సుదీర్ఘ చర్చల అనంతరం బడ్జెట్ కు ఓ రూపం తీసుకువచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర బడ్జెట్ను ఈనెల 28వ తేదీన ప్రవేశపెట్టనున్నారు.

Next Story