- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరకామణి చోరీ కేసులో దోషులకు శిక్ష పడాల్సిందే.. YV సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
పరకామణి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) విచారణ ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: పరకామణి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) విచారణ ముగిసింది. విజయవాడలోని సీఐడీ కార్యాలయంలోఅధికారులు ఆయనను సుమారు గంట పాటు విచారించి ఇచ్చిన స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సీఐడీ (CID) అధికారులు అడిగి అన్ని ప్రశ్నాలకు తాను సమాధానం ఇచ్చానని పేర్కొన్నారు. విచారణకు అన్ని విధాలుగా సహరికస్తానని చెప్పినట్లుగా తెలిపారు. పరకామణి చోరీ తప్పేనని.. దోషులకు శిక్ష పడాల్సిందేనని కామెంట్ చేశారు. తాను టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు చోరీ జరిగినా.. అప్పుడు తెలియలేదని అన్నారు. తాను టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చాకే ఈ చోరీ బయటపడిందని పేర్కొన్నారు. ఈ కేసులో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా సీఐడీ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టే విచారణకు పూర్తిగా సహరిస్తున్నానని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.






