- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం కేసులో నిందితుడు చాణక్య బెయిల్ పిటిషన్ పై విచారణ
మద్యం కేసులో (AP Liquor Scam) నిందితుడుగా ఉన్న చాణక్య బెయిల్ పిటిషన్ ను విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) విచారించింది.

దిశ, వెబ్ డెస్క్ : మద్యం కేసులో (AP Liquor Scam) నిందితుడుగా ఉన్న చాణక్య బెయిల్ పిటిషన్ ను విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) విచారించింది. విచారణ నేపథ్యంలో అధికారులు చాణక్యను కోర్టుకు హాజరుపరిచారు. పిటిషన్ ను విచారించిన అనంతరం డిసెంబర్ 23న ఉత్తర్వులు వెల్లడిస్తామని కోర్టు వెల్లడించింది. దీంతో అధికారులు తిరిగి విజయవాడ జిల్లా జైలుకు నిందితుడిన తీసుకెళ్లారు. మద్యం కేసులో కీలక పాత్రధారిగా ఉన్న రాజ్ కెసిరెడ్డి ఆదేశాల మేరకు చాణక్య పని చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అతను ఏ8గా ఉన్నాడు.
ఇదే కేసులో మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, పెల్లకూరు కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించిన విషయం విదితమే. అందుకు సంబంధించిన తదుపరి విచారణను జనవరి 21కి కోర్టు వాయిదా వేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలిలతో కూడిన ధర్మాసనం వారి పిటిషన్లను విచారించింది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు సి.ఆర్యమ సుందరం, నిరంజన్ రెడ్డి, సిద్ధార్థ వేలు వాదనలు వినిపించగా కౌంటర్ అఫిడవిట్లకు సంబంధించి రెండు రిజాయిండర్లు దాఖలు చేశామని, మరొకటి సోమవారం దాఖలు చేస్తామని వారు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. దీంతో కోర్టు తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. ట్రయల్ కోర్టు తదుపరి చర్యలకు తమ మధ్యంతర ఉత్తర్వులు అడ్డంకి కాదని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా స్పష్టం చేసిన విషయం తెలిసిందే.






