పులివెందుల నేత ఇంట్లో నక్కిన స్థానికేతరులు.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-11 08:41:57  IST  )

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలకు కౌండ్ డౌన్ స్టార్ట్ అయింది. ...

పులివెందుల నేత ఇంట్లో నక్కిన స్థానికేతరులు.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల(Pulivendula Zptc Elections)కు కౌండ్ డౌన్ స్టార్ట్ అయింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగే పోలింగ్(Polling) కోసం పోలీసులు, ఎన్నికల(Elections) సిబ్బంది పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే 100 మందికి పైగా బైండో‌వర్ చేశారు. పులివెందుల పరిధిలో స్థానికేతరులెవరూ ఉండకూడదని హెచ్చరికలు జారీ చేశారు.

అయితే పులివెందులలో పోలీసుల హెచ్చరికలను కొందరు బేఖాతరు చేస్తున్నారు. పులివెందుల పరిధిలో చాలా స్థానికేతరులు తిష్ట వేశారు. పులివెందుల మండలం నల్లపురెడ్డిపాలెంలో ఓ పార్టీకి చెందిన వ్యక్తి ఇంట్లో తిరుపతికి చెందిన 15 మంది ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో డీఎస్పీ మురళీ నాయక్(DSP Murali Nayak) ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఓ పార్టీకి చెందిన బలరామరెడ్డి ఇంట్లో 15 మంది ఉన్నట్లు గుర్తించారు. అయితే డీఎస్పీ బృందం తనిఖీలతో వాళ్లంతా పరారయ్యారు. తిరుపతికి చెందిన ఓ వ్యక్తిని మాత్రం చేజ్ చేసి పట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పులివెందుల మండలంలో స్థానికేతరులు ఎవరున్నా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ మురళీనాయక్ హెచ్చరించారు.

Next Story