- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓరి దేవుడా ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా?: ఏలూరు ఎస్పీ ఆఫీసుకు క్యూ కట్టిన బాధితులు
పశ్చిగోదావారి జిల్లాలో నిత్య పెళ్లి కూతురు మోసాలు సంచలనంగా మారాయి....

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి చేసుకోవడం, డబ్బు గుంజుకోవడం, వదిలేయడం అది ఆమె పని. అలా 12 మందిని పెళ్లి చేసుకుంది. ఆమెకు బంధువులు కూడా ఉన్నారు. అయితే వారు కూడా ఈ మోసంలో భాగమే. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న వ్యక్తులే వాళ్ల టార్గెట్. వాళ్ల గురించి తెలుసుకోవడం, రెండో పెళ్లి మాట్లాడుకోవడం, డబ్బులు ఖర్చు పెట్టించడం. ఆ అవసరం, ఈ అవసరం ఉంది అని చెప్పడం, డబ్బులు తీసుకోవడం. ఆ తర్వాత గొడవు పెట్టుకోవడం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టడం. ఇది వీరదుర్గ నీలిమ ఘరానా మోసాలు. ఈ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం ఇప్పుడు ఉభయగోదావరి జిల్లాలో సంచలనంగా మారింది.
వీర దుర్గ నీలిమ, వీరలక్ష్మి, దుర్గ, కల్యాణ్, శ్రీను వీరంతా ముఠాగా మారి పెళ్లి పేరుతో విడాకుల తీసుకున్న వ్యకులను మోసం చేస్తున్నారు. ఇలా వీరదుర్గ నీలిమ పెళ్లి కూతురు, మిగిలిన నలుగురు ఆమె తల్లిదండ్రులు, బంధువులు. ఇలా నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరులో 12 మంది వ్యక్తులను పెళ్లి పేరుతో మోసం చేశారు. అంతేకాదు వారిని బెదిరించి డబ్బులు కూడా దండుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి చెక్కేశారు. దీంతో అమలాపురం ఎస్పీ కార్యాలయానికి బాధితులు క్యూ కట్టారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






