రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై ప్రభుత్వం దూకుడు.. భారీగా నిధుల విడుదల

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-19 12:21:06  IST  )

రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అచంచలమైన కృషి చేస్తోంది....

రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై ప్రభుత్వం దూకుడు.. భారీగా నిధుల విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల(Airports) అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అచంచలమైన కృషి చేస్తోంది. ఇప్పటికే భోగాపురం ఎయిర్ పోర్టును శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరిన్ని ఎయిర్ పోర్టుల అభివృద్ధి కోసం ఇప్పటికే కార్పొరేషన్(APADCL)ను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మరో 7 విమానాశ్రయాలు కూడా అభివృద్ధికి నోచుకోనున్నాయి. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, తుని-అన్నవరం, ఒంగోలులోనూ ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధికి భూసేరకరణ చేపడుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు తాడేపల్లిగూడెం ఎయిర్ పోర్టుకు భూసేకరణ చేపట్టింది. రూ.1570 కోట్లు నిధులు కూడా మంజూరు చేసింది.

తాజాగా మిగిలిన ఎయిర్ పోర్టుల అభివృద్ధిపైనా ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈ మేరకు ఎయిర్ పోర్టు అభివృద్ధి కార్పొరేషన్‌కు నిధులు మంజూరు చేసింది. APADCLకు రూ.75 కోట్లు మంజూరు చేసింది. అలాగే హడ్కో రుణం తీర్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో విమాన సేవలు మరింత మెరుగుపడనున్నాయి.

Next Story