నేతన్నలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఉచిత విద్యుత్ పథకం అమలు తేదీ ఖరారు

by Vemula.Srinu Prasad |

ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది....

నేతన్నలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఉచిత విద్యుత్ పథకం అమలు తేదీ ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం(Kutami Government) సిద్ధమైంది. ఈ మేరకు నేతన్నల(Weavers)కు గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకం( Free Electricity Scheme) అమలు చేయనున్నట్లు ప్రకటించింది. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లను ఉచితంగా అందజేయనున్నట్లు వెల్లడించింది. మగ్గం కలిగిన 93 వేల కుటుంబాలు, మర మగ్గాలు వాడుతున్న 10,534 కుటుంబాలు మొత్తం 1,03,534 కుటుంబాలకు లబ్ది కలుగనుందని పేర్కొంది. తద్వారా ప్రభుత్వంపై ఏడాదికి రూ.85 కోట్లకుపైగా భారం పడనున్నట్లు స్పష్టం చేసింది. మగ్గం వాడే నేతన్నకు నెలకు రూ.720లు, ఏడాదికి రూ.8,640లు ఆదా కానున్నట్లు చెప్పింది. మర మగ్గం లబ్దిదారులకు నెలకు రూ.1800లు, ఏడాదికి రూ.21,600లు ఆర్థికంగా లబ్ధికలుగుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Next Story