రాయలసీమలో కరువు పరిస్థితులు.. కేంద్రానికి ఎంపీ కీలక విజ్ఞప్తి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-11 13:45:00  IST  )

రాయలసీమప్రాంత నీటి కొరత తీర్చేందుకు కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది...

రాయలసీమలో కరువు పరిస్థితులు.. కేంద్రానికి ఎంపీ కీలక విజ్ఞప్తి
X

దిశ, వెబ్ డెస్క్: రాయలసీమ(Rayalaseema) ప్రాంత నీటి కొరత తీర్చేందుకు కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా బనకచర్ల వద్ద ప్రాజెక్టు నిర్మించేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ ప్రాజెక్టును పోలవరం(Polavaram)తో అనుసంధానం చేస్తూ గోదావరి జిలాల(Godavari Water)ను సీమకు అందజేయాలనే లక్ష్యంతో వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఆమోదం పొందడంతో పాటు నిధులు రాబట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్రానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు(Mp Bastipati Nagaraju) కీలక విజ్ఞప్తులు చేశారు.

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంతో పాటు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని నాగరాజు కోరారు. సీమలో నీటి కొరత తీవ్రంగా ఉందని, కరువు పరిస్థితులతో ఆ ప్రాంత ప్రజలు పోరాటం చేస్తున్నారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. సీమలో కేవలం 25 శాతం భూమి మాత్రమే నీటి పారుదల సౌకర్యం కలిగి ఉందని తెలిపారు. సీమకు శాశ్వత పరిష్కరం చేసేలా సీఎం చంద్రబాబు నాయడు బనకచర్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. నంద్యాలలోని బనకచర్ల వద్ద రిజర్వాయర్ చేపట్టేందుకు ఇప్పటికే ప్రాతిపాదనలు కూడా చేసినట్లు వెల్లడించారు. రాయలసీమ ప్రాంత సమస్యల పరిష్కారానికి బనకచర్ల ప్రాజెక్టు వెలుగు రేఖ అవుతుందని కేంద్రానికి ఎంపీ నాగరాజు వివరించారు.

Next Story