పేదలకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 2 నుంచి రేషన్ కార్డుల ప్రక్రియ

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-11-24 11:31:49  IST  )

కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది.

పేదలకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 2 నుంచి రేషన్ కార్డుల ప్రక్రియ
X

దిశ, వెడ్ డెస్క్: కూటమి ప్రభుత్వం(Coalition Government) మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. తాము అధికారంలోకి వస్తే అర్హులైన పేదలకు రేషన్ కార్డులు(Ration Cards) మంజూరు చేస్తామి హామీ ఇచ్చింది. ఈ మేరకు కసరత్తులు ప్రారంభించింది.. వచ్చే నెలలో ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమాచారం. వైఎస్ జగన్(Ys Jagan) ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకుని కార్డులు రాని వారికి కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారితో పాటు కొత్త దరఖాస్తుదారులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి(Sankranti) కానుకగా పేదలకు కొత్త రేషన్ కార్డులు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Next Story