Breaking: ఏపీ రాజధానికి విరాళాలు సేకరణ

by Vemula.Srinu Prasad |

ఏపీ రాజధాని నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...

Breaking: ఏపీ రాజధానికి విరాళాలు సేకరణ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని(Ap Captial) నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి(Amaravati) నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తోంది. ఇందులో భాగంగా విరాళాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన చేసింది. అంతేకాదు ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాజధానికి ఆర్థిక సాయం చేయాలనుకునే వారికోసం సీఆర్డీఏ వెబ్ సైట్ crda.ap.gov.inను రూపొందించింది. అలాగే క్యూఆర్ కోడ్‌ను సైతం ఏర్పాటు చేసింది. లింక్ స్కాన్ చేస్తే బ్యాంకు అకౌంట్‌లో నుంచి నేరుగా సీర్డీఏ ఖాతాలోకి విరాళాలు వెళ్లేలా ప్లాన్ చేసింది. రాజధాని అమరావతి నిర్మాణానికి వీలైనంత సాయం చేయాలని ప్రభుత్వం కోరింది.

గతంలోనూ....

కాగా ఇదే విధంగా గతంలోనూ రాజధాని నిర్మాణం కోసం విరాళాలు సేకరించారు. మై బ్రిక్, బై అమరావతి అనే పేరుతో విరాళాలు స్వీకరించారు. ఒక్కో E-ఇటుకను రూ.10 వెచ్చించారు. దీంతో ప్రజలు ఈ ఇటుకలను కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఎన్నారైలు కొందమంది 10 వేల ఇటుకలను కొనుగోలు చేసి అమరావతి నిర్మాణానికి సాయం చేశారు.

ప్రస్తుతమూ...

ప్రస్తుతం అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. మరోవైపు అమరావతిని చట్టబద్ధత చేసేందుకు ప్రయత్నాలూ కొనసాగుతున్నాయి. తొలి విడుదల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విరాళాలు సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Next Story