ప్రభుత్వానికి భారీ ఊరట.. హైకోర్టు కీలక తీర్పు

by Vemula.Srinu Prasad |

కూటమి ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది.....

ప్రభుత్వానికి భారీ ఊరట.. హైకోర్టు కీలక తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. పీపీపీ విధానం(PPP system)పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు(High court) తీర్పు ఇచ్చింది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఈ మేరకు హైకోర్టుకు వెళ్లింది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల(Medical College)ను నిర్మించేందుకు ప్రభుత్వం చేపట్టిన టెండర్ల ప్రక్రియపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్నధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, అది చట్ట విరుద్ధం అయితే తప్ప కోర్టులు జోక్యం చేసుకోలేవని చెప్పింది. టెండర్ ప్రక్రియను అడ్డుకుంటూ ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు(High Court) ధర్మాసనం తేల్చి చెప్పింది. దీంతో ఇంతకాలం నానా యాగి చేసిన వైసీపీ నేతలకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. కూటమి నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Next Story