హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. రూ. లక్ష ఆర్థిక సాయం ప్రకటన

by Vemula.Srinu Prasad |

విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి పవిత్ర హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది...

హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. రూ. లక్ష ఆర్థిక సాయం ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం(Vijayawada Embarkation Center) నుంచి పవిత్ర హజ్(Hajj) యాత్రికుల(Pilgrims)కు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. గన్నవరం విమానాశ్రయం నుంచి హజ్‌కు వెళ్లే ప్రతి యాత్రికుడికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా యాత్రకు వెళ్లే వారందరికీ రూ.లక్ష ఆర్థిక సహాయం అందించనుంది. విజయవాడ నుంచి వెళ్లే యాత్రికులపై విమాన చార్జీల భారం తగ్గించేందుకే ఈ ఆర్థిక సాయం అందిస్తోంది.


గన్నవరం విమానాశ్రయం పరిసర జిల్లాల యాత్రికులకు మరింత సౌకర్యం కల్పించడంతో పాటు, ఏపీ రాజధానిగా అమరావతి ప్రాముఖ్యతను పెంచే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం నుంచి హజ్‌కు వెళ్లే యాత్రికులంతా విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Next Story