పింఛన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే నగదు జమ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-27 08:01:31  IST  )

పింఛన్ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది....

పింఛన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే నగదు జమ
X

దిశ, వెబ్ డెస్క్: పింఛన్ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కొత్త సంవత్సరం సందర్భంగా ఒక రోజు ముందే నగదు జమ చేస్తున్నట్లు స్పష్టంచేసింది. 2026 జనవరి 1 నూతన సంవత్సరం సందర్బంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు డిసెంబర్ 31వ తేదీన అందజేయడం జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.12 లక్షల పింఛనుదారులకు రూ.2743.99 కోట్లు ఇంటివద్దనే పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. డిసెంబర్ 31న పంపిణీ కాకపోతే జనవరి 2న పింఛనుదారులకు సచివాలయ సిబ్బంది నగదు అందజేస్తారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Next Story