- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేనేతలకు గుడ్ న్యూస్.. ఉచిత విద్యుత్ అమలుకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో చేనేతలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో చేనేతల(Handicrafts)కు కూటమి ప్రభుత్వం(Government) గుడ్ న్యూస్ తెలిపింది. ఉచిత విద్యుత్(Free Electricity) అమలుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనుంది. నేతన్నల ఉచిత విద్యుత్‌కు రూ.125 కోట్ల వ్యయాన్ని కేటాయించింది. ఈ పథకం ద్వారా 50 వేల మగ్గాలు, 15 వేల మర మగ్గాల కలిగిన కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. చేనేతలకు ఇచ్చిన ఎన్నికల హామీని సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి సవిత(Minister Savitha) తీసుకెళ్లారు. జాతీయ చేనేత దినోత్సవానికి వారం ముందుగానే ఉచిత విద్యుత్ పథకం అమలుకు సీఎం చంద్రబాబు పచ్చ జెండా ఊపారు. నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. చేనేతలకు ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చడంపై ఆమె ధన్యవాదాలు తెలిపారు.
Read More: క్షణం ఆలోచించకుండా తోక కత్తిరిస్తా.. చంద్రబాబు హెచ్చరిక






