- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ఎక్స్‌లో మంత్రి లోకేశ్ కీలక ట్వీట్
ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది..

దిశ, వెబ్ డెస్క్: దేశంలోనే తొలిసారిగా ‘మన మిత్ర’(Mana Mithra) పేరుతో కూటమి ప్రభుత్వం(Alliance Governement) వాట్సప్ గవర్నెన్స్(WhatsApp Governance) విధానాన్ని రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సేవల్లో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. తొలి దశలో వాట్సప్ ద్వారా 161 పౌరసేవలను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ప్రజా వినతులు స్వీకరించడంతో పాటు వారికి అవసరమైన సమాచారాన్ని కూడా 9552300009 ద్వారా అందిస్తోంది. దేవాదాయ, ఇందనం, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ మున్సిపల్ తదితర శాఖల్లో వాట్సప్ ద్వారా సేవలు కొనసాగిస్తోంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయ, నో ఎర్నింగ్ ఇలా వివిధ శాఖలకు సంబంధించిన చాలా సర్టిఫికెట్లను కూడా వాట్సప్ ద్వారా అందిస్తోంది. విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్సులు, రెవెన్యూ శాఖకు సంబంధించిన ల్యాండ్ రికార్డులు, ఏపీఎస్ ఆర్టీసీ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్ సర్వీసు, సర్వీసు రిఫండ్, ఫీడ్ బ్యాక్ తదితర సేవలను కూడా కొనసాగిస్తోంది.
ఇక వాట్సప్ నెంబర్‌కు మెసేజ్ చేస్తే వెంటనే ఒక లింక్ పంపుతోంది. అందులో పేరు, ఫోన్ నెంబర్, చిరునామా తదితరలు పొందుపరిచి, వారి వినతిని టైప్ చేస్తే ఒక రిఫరెన్స్ నంబర్ వస్తోంది. దాని ఆధారంగా తమ వినతి పరిష్కారం ఎంత వరకూ వచ్చింది..?. ఎవరి వద్ద ఉంది అనేది పౌరులు తెలుసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఏ సమస్యనైనా వాట్సప్ ద్వారా ప్రభుత్వానికి వివరించొచ్చు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అర్హతలు, ఆయా పథకాల ద్వారా కలిగే లబ్ధిని కూడా ఈ విధానంలో తెలుసుకోవచ్చు. పర్యాటక ప్రదేశాల సమాచారం, టికెట్లు, వసతి సహా అన్ని వాట్సప్ ద్వారా బుక్ చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
అయితే ఈ సేవలు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. ప్రజలు విపరీతంగా వాట్సప్ గవర్నెన్స్ విధానాన్ని వినియోగించుకుంటున్నారు. దీంతో మరో 39 సేవలను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 200 సేవలను వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పరిష్కారం చూపుతున్నారు. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ హర్షం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ అద్భుతమైన మైలురాయిని దాటిందని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వాట్సాప్‌గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి 200 సేవలు వచ్చాయని తెలిపారు. ప్రజలకు మరింత పారదర్శకంగా పాలన అందిస్తామని చెప్పారు. ‘మనమిత్రా’ వాట్సాప్ నెంబర్ 95523 00009 అంటూ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.






