- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతి బ్యూటిఫికేషన్‌పై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Ap Capital Amaravati) అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పెట్టుబడులు కోసం విదేశాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) రాష్ట్రానికి రావాలని పలు కంపెనీలను ఆహ్వానించారు. ఇటీవల సింగపూర్(Singapoor)కు వెళ్లిన ఆయన అక్కడి జరిగిన అభివృద్ధిని పరిశీలించారు. ఈ మేరకు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి ప్రతినిధులను కోరారు. విశాఖలో జరిగే సమ్మిట్‌లో పాల్గొనాలని సింగపూర్ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. సింగపూర్ పర్యటన అనంతరం రాష్ట్రానికి వచ్చిన సీఎం చంద్రబాబు.. తాజాగా పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్ధసారధితో సమీక్ష నిర్వహించారు.
రాజధాని అమరావతి బ్యూటిఫికేషన్(Amaravati Beatification), గ్రీన్ -బ్లూ మాస్టర్ ప్లాన్(Green-Blue Master Plan)పై చంద్రబాబు చర్చించారు. అమరావతిలో ట్రంక్ రోడ్లు, ఇతర అనుబంధ రోడ్లు, ఎల్పీఎస్ రోడ్లు, బఫర్ జోన్లలో ప్లాంటేషన్, బ్యూటిఫికేషన్, అవెన్యూ ప్లాంటేషన్ పైనా అధికారులతో సీఎం చర్చించారు. అమరావతిలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో పార్కులు, హరిత ప్రాంతం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఔషధ మొక్కలను నాటడంతో పాటు అమరావతిలో బయోడైవర్సిటీ ఉండేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో దేశీయ వృక్షజాతులు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. రివర్ ఫ్రంట్ కూడా సుందరంగా కనిపించేలా శ్రద్ధ పెట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.






