- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: PPP విధానంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అధికారులకు ఆదేశాలు జారీ
పీపీపీ విధానంపై ముందుకే వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ...

దిశ, వెబ్ డెస్క్: పీపీపీ(PPP) విధానంపై ముందుకే వెళ్లాలని కూటమి ప్రభుత్వం(Government) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ(Health Department)తో నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తామని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదిలేదన్నారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే వీజీఎఫ్(VGF)కు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వీజీఎఫ్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 30 శాతం చొప్పున ఆర్థిక సాయం చేస్తాయని చెప్పారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నామని వైసీపీ చేస్తున్న తప్పుప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థతో ఒప్పందం చేసుకోవాలని వైద్యారోగ్య అధికారులకు సీఎం చంద్రబాబు (Cm Chandrababu)సూచించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.






