కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రాత పరీక్షకు తేదీ ఖరారు

by Vemula.Srinu Prasad |

కానిస్టేబుల్ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం బిగ్ అలర్ట్ ప్రకటించింది....

కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రాత పరీక్షకు తేదీ ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్: కానిస్టేబుల్ అభ్యర్థుల(Constable Candidates)కు కూటమి ప్రభుత్వం బిగ్ అలర్ట్ ప్రకటించింది. ప్రిలిమినరీ, ఫిజికల్ టెస్తులు పూర్తి చేసిన అభ్యర్థులకు జూన్ 1న తుది రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ పరీక్షకు మొత్తం 38,910 మంది అభ్యర్థులు అర్హత సాధించారని, వీరికి జూన్ 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. పరీక్ష విధానం ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉండనున్నట్లు తెలిపింది. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు మరింత సమాచారం తెలుసుకునేందుకు https://slprb.ap.gov.inను సందర్శించాలని పోలీస్ శాఖ స్పష్ఠంచేసింది.

Next Story