ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-01 13:36:00  IST  )

న్యూ ఇయర్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రభుత్వం తీపికబురు అందించింది. ..

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ
X

దిశ, వెబ్ డెస్క్: న్యూ ఇయర్(New Year) సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు కేంద్రం ప్రభుత్వం తీపికబురు అందించింది. కనీస వసతులు లేని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 2020 జాతీయ విద్యా విధానం ద్వారా సకల సౌకర్యాలు కల్పించడంతో పాటుగా నాణ్యమైన విద్యను సైతం అందించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని వర్చువల్‌గా జరిగిన సమావేశంలో ఏపీ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కి తెలియజేసింది. ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద రాష్ట్రంలోని 935 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా స్కూళ్ల భవనాలు, మౌలిక వసతులు, డిజిటల్ సౌకర్యాలు, అత్యాధునిక ల్యాబ్స్‌తో పాటు స్మార్ట్ తరగతి గదులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.

Next Story