Breaking: ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్ రాజీనామాకు కేంద్రం ఆమోదం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-11 17:45:04  IST  )

ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్ రాజీనామాకు కేంద్రం ఆమోదం తెలిపింది..

Breaking: ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్ రాజీనామాకు కేంద్రం ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్ రాజీనామా(IPS Siddhartha Kaushal resigns)కు కేంద్రం ఆమోదం తెలిపింది. సిద్ధార్థ కౌశల్ తన పదవికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విరమణకు సంబంధించి కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కౌశల్ 2012 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి కాగా రెండు రాష్ట్రాల్లో పని చేశారు. వ్యక్తి గత కారణాలతోనే తాను పదవీ విరమణ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన చేసిన రాజీనామా జూన్ 30, 2025 నుంచి అమల్లోకి వచ్చిందని సీఎస్ కె. విజయానంద్ నోటిఫికేషన్ జారీ చేశారు.

Next Story