దేవతల రాజధాని.. రైతుల త్యాగం అమరావతి : మంత్రి నారా లోకేష్

by Thanuru Gopichand |

దేవతల రాజధాని.. రైతుల త్యాగం అమరావతి అని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు.

దేవతల రాజధాని.. రైతుల త్యాగం అమరావతి : మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్ : దేవతల రాజధాని.. రైతుల త్యాగం అమరావతి అని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. అమరావతిలో బ్యాంకు భవనాల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. దేవతల రాజధానిని దెయ్యాల లాగా నాశనం చేయాలని చూశారని.. మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడి గత ప్రభుత్వంలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదన్నారు. కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి విశాఖటప్నంలో ప్యాలెస్ కట్టారని గుర్తు చేశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో తామంతా ముందుకెళ్లామన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని కోసం పోరాడామన్నారు. జై అమరావతి అంటే కేసులు పెట్టారని, మహిళలను పోలీసు బూట్లతో తన్నారని పేర్కన్నారు. 1130 రోజులు ఉద్యమం నడిచిందని అన్నారు. 270 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. మూడు వేల మందికి పైగా రైతులపై కేసులు పెట్టారన్నారు. అమరావతి ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన అమరావతి అని తామంతా గర్జించామన్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క పిలుపుతో మూడు పంటల భూమిని ఐదు కోట్ల ఆంధ్రుల కోసం ఇవ్వడం గొప్ప విషయమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి అని నిశ్చయమైందన్నారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో పనులు జెట్ స్పీడ్ లో అవుతున్నాయని పేర్కొన్నారు. శక్తివంతమైన స్త్రీ శక్తి అంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గుర్తొస్తారన్నారు. పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీల వారు అబద్ధాలు చెబితే చుక్కలు చూపిస్తారన్నారు. మహిళలు ఎలా ఉండాలో వారిని చూస్తే అర్థమవుతుందన్నారు.

ప్రపంచంలో ఎందరో ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నారు. కానీ నిర్మలా సీతారామన్ 8 కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టారని కొనియాడారు. వారు లండన్ లో ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించారన్నారు. 2008లో బిజెపిలో చేరి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారన్నారు. ఫోర్బ్స్ మ్యాగ్జిన్ జాబితాలో వరుసగా 6 సార్లు పవర్ ఫుల్ వుమెన్ గా నిలిచారు. ఎంత ఎదిగినా ఒదగాలని వారిని చూసి నేర్చుకున్నా అని మంత్రి లోకేష్ చెప్పారు. అనేకసార్లు మంగళగిరి చీరలు ప్రమోట్ చేశారన్నారు. మంగళగిరి వాసుల తరపున వారికి ధన్యవాదాలు తెలిపారు.

పేద, మధ్య తరగతి కుటుంబాలకు జీఎస్టీ 2.0 తెచ్చినప్పుడు సునాయసంగా అమలు చేశారన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడు సహాయం కోరిన ఆంధ్రులకు అండగా నిలబడి నిర్మలా సీతారామన్ నడిపిస్తున్నారు. ఆగిపోయిన అమరావతి పనులను దారిలో పెట్టి ఆర్థిక వనరులు అందించారన్నారు. గతంలో రివర్స్ ట్రెండింగ్ అని కాలయాపన చేస్తే ప్రత్యేక టీం ఏర్పాటు చేసిన పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ముఖ్యమంత్రితో మీటింగ్ పెట్టి దాన్ని కూడా దారిలో పెట్టారని తెలియజేశారు. ప్రపంచమంతా విశాఖవైపు చూడటానికి కారణం డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. కానీ దానికి అండగా నిలిచింది నిర్మలా సీతారామన్ అని స్పష్టం చేశారు. ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు. అమరావతిలో బ్యాంక్ స్ట్రీల్ ఏర్పాటవుతుందని, దాని వల్ల ఆర్థికంగా రాష్ట్రం బలపడటమే కాక సుమారు 7వేల మంది ఉద్యోగాలు రాబోతున్నాయని మంత్రి లోకేష్ వెల్లడించారు.

Next Story