- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Diamonds: జొన్నగిరిలో వజ్రాలు.. ఎగబడిన జనం..?
కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో వజ్రాలు దొరుకున్నాయనే ప్రచారం కొనసాగుతోంది...

దిశ, వెబ్ డెస్క్: పది రూపాయలు దొరికితేనే వదిలిపెట్టని కొంతమంది జనం.. అదే వజ్రాలు ఊరకే దొరుకుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది రాయలసీమ ప్రాంతంలో వర్షాలు పడే సమయంలో ఇది సర్వ సాధారణమే. అయినా వజ్రాలు దొరుకుతున్నాయి కదా.. మిగిలిన జనం ఊహలు మాత్రం ఊయలలా ఊగుతాయి.
కర్నూలు జిల్లా(Kurnool District) జొన్నగిరి(Jonnagiri) ప్రాంతంలో వజ్రాలు(Diamonds) దొరుకున్నాయనే ప్రచారం కొనసాగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో పంట పొలాలు, ఖాళీ ప్రదేశాల్లో వజ్రాలు దొరుకున్నాయని ప్రచారం జోరందుకుంది. దీంతో జనం జొన్నగిరి ప్రాంతానికి ప్రజలు భారీగా వెళ్తున్నారు. అన్నం కట్టుకుని మరీ రోజంతా అక్కడే ఉండి వజ్రాల వేట కొనసాగిస్తు్న్నారు. ఓ రైతుకు వజ్రం దొరకడంతో ఆయన లక్షాధికారి అయ్యారని, తమ జీవితాలు కూడా టర్న్ అవుతాయనే ఉద్దేశంతో పక్క జిల్లాల నుంచి జనం వస్తున్నారు. రోజుల తరబడి అక్కడే ఉండి ఒక్క వజ్రాన్ని దొరికించుకుంటామని చెబుతున్నారు. దొరకని పక్షంలో తిరిగి తమ స్వగ్రామాలకు వెళతామని అంటున్నారు.






