- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ భవిష్యత్తుపై కీలక మలుపు.. రాజధాని చట్టబద్ధతకు కేబినెట్ ముద్ర
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై మంత్రివర్గం తీర్మానం చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్‌లో మంత్రి వర్గం భేటీ జరిగింది....

దిశ, వెబ్ డెస్క్: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై మంత్రివర్గం తీర్మానం చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్‌లో మంత్రి వర్గం భేటీ జరిగింది. మూడు గంటలపాటు వివిధ కీలక అంశాలపై చర్చించింది. ఈమేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-5ను సవరించాలని తీర్మానం చేసింది. సీఆర్డీఏ చట్టం పరిధిలోని అమరావతి పేరును కొత్త రాజధానిగా చేర్చాలని నిర్ణయించింది. ఈ నెల 28న అసెంబ్లీలో 4 గంటల పాటు రాజధాని అమరావతిపై చర్చ పెట్టి తీర్మానించాలని కేబినెట్ నిర్ణయించింది..
పొట్టి శ్రీరాములు పోరాటం, కర్నూలు రాజధానిగా ఆంధ్ర ఏర్పాటు, హైదరాబాద్ రాజధానిగా ఏపీ ఆవిర్భావం, తెలంగాణ విభజన, అమరావతి ఏర్పాటు ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. అమరావతి రాజధానిగా సమర్ధించిన జగన్, 3 రాజధానులు నాటకాన్ని ప్రజలకు గుర్తు చేయాలని మంత్రులు దిశానిర్దేశం చేశారు.






