ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. 24 ఎజెండా అంశాలకు గ్రీన్ సిగ్నల్

by Vemula.Srinu Prasad |

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో 24 అజెండా అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. 24 ఎజెండా అంశాలకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. 24 ఎజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అజెండా అంశాలన్నింటికీ ఆమోదం తెలిపారు. నంద్యాల జిల్లాలో నిర్మించనున్న 250 మెగా వాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు(Solar Power Project) కోసం 1500 ఎకరాల భూమిని ఎన్ఆర్ఈడీసీఏపీ(NREDCAP)కి కేటాయిస్తూ ఆమోదం తెలిపారు. ఇందుకు ఆ సంస్థ ప్రతి సంవత్సరం రూ.31 వేలు చెల్లించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. అలాగే ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం తోటపల్లిలో కంప్రెస్ట్ బయోగ్రాస్ ప్లాంట్‌ కోసం ఎన్ఆర్ఈడీసీఏపీకు 45.60 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయింపుననకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నీటి పారుద శాఖలో 7,189 నిర్వహణ పనులకు పరిపాలనా అనుమతులు ఇస్తూ కేబినెట్ నిర్ణయించింది.

భూముల బదిలీలపైనా..

ఇక భూముల బదిలీకి సంబంధించి చట్ల సవరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ సభ్యులు ఆమోదం తెలిపారు. విశాఖ జిల్లా గాజువాక రెవెన్యూ గ్రామంలో 1000 చదరపు గజాల వరకూ క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువను మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా అభ్యంతరం లేని ప్రభుత్వం భూముల్లోని నివాసాలను ఆక్రమణల క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువును మరో నాలుగు నెలలు పెంచుతూ ఈ భేటీలో మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్ కోసం, తిరుపతిలోని ఏపీఎస్డీసీ కోసం డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటుకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపారు. అటు కృష్ణా జిల్లా కీసరలో సర్వే నెం.29/8లోని 3.84 ఎకరాల భూమిని కస్టమ్స్ కమిషనరేట్ కార్యాలయం, నివాస గృహాల నిర్మానికి కోసం ఉపయోగించేందుకు ఇచ్చిన జీవోలో మార్పు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Next Story