- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచే కాలేజీలు ప్రారంభం
ఇంటర్ సెకండియర్ విద్యార్థుల కు బోర్డు బిగ్ అలర్ట్ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచే కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని ప్రకటించింది. ..

దిశ, వెబ్ డెస్క్: ఇంటర్ సెకండియర్ విద్యార్థుల(Inter Secound Year Student)కు బోర్డు బిగ్ అలర్ట్ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచే కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి రెండో సంవత్సరానికి వెళ్లే విద్యార్థులు ఏప్రిల్ 1 నుంచి 23 వరకు జరిగే క్లాసులకు హాజరుకావాలని, అలాగే 24 నుంచి మే 31 వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. కాగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యలో NCERT సిలబస్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి నుంచే CBSE విధానాన్ని అమల్లోకి తీసుకొస్తు్న్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఫస్టియర్ పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్‌లో తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం వేసవి సెలవులు ఇచ్చే నిబంధనను సైతం అమల్లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపధ్యంలోనే ఇప్పటి నుంచే ఫస్టియర్ విద్యార్థులను అప్రమత్తం చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు.






